వార్త ముఖ్యాంశాలు
- టైటిల్!!!!!!భక్తి, శ్రద్దలతో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు!!!!!!!!
- పామూరు, అక్టోబర్ 27(పున్నమి న్యూస్ ప్రతినిధి ) మార్కాపురం జిల్లా పామూరు మండల కేంద్రంలో నూతనంగా వెలసి, నిర్మాణదశలో వున్న వాల్మీకి మహర్షి రాతి కట్టడపు గుడిదగ్గర జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు..
- ఈ సందర్బంగా పామూరు మండలంలోని వాల్మీకి సోదర, సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని, వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూల మాలలు వేసి,ఘనంగా నివాళులర్పించారు.వాల్మీకి సంఘ సోదరులు మాట్లాడుతూ,అందరికి మార్గదర్శి అయిన రామాయణం లాంటి మహాకావ్యం రచించిన ధన్యజీవి వాల్మీకి మహర్షి అని కొనియాడారు..
టైటిల్!!!!!!భక్తి, శ్రద్దలతో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు!!!!!!!!
పామూరు, అక్టోబర్ 27(పున్నమి న్యూస్ ప్రతినిధి ) మార్కాపురం జిల్లా పామూరు మండల కేంద్రంలో నూతనంగా వెలసి, నిర్మాణదశలో వున్న వాల్మీకి మహర్షి రాతి కట్టడపు గుడిదగ్గర జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.. ఈ సందర్బంగా పామూరు మండలంలోని వాల్మీకి సోదర, సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని, వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూల మాలలు వేసి,ఘనంగా నివాళులర్పించారు.వాల్మీకి సంఘ సోదరులు మాట్లాడుతూ,అందరికి మార్గదర్శి అయిన రామాయణం లాంటి మహాకావ్యం రచించిన ధన్యజీవి వాల్మీకి మహర్షి అని కొనియాడారు.. ఆయన చూపిన సత్యం, అహింస, ధర్మ మార్గాలు నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మండలంలోని వాల్మీకి సోదరులంతా ఐక్యంగా వుంటూ, విద్యా, సామాజిక, రాజకీయ రంగాల్లో ముందడుగు వేయాలని పులుపునిచ్చారు.. ఈ జయంతి వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమంలో మండలస్థాయి ప్రజాప్రతినిధులు మరియు యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు.. ఆంధ్ర రాష్ట్రంలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో, వాల్మీకి మహర్షి రాతిగుడి పామూరులో మాత్రమే ఉండటం విశేషం..