Wednesday, 30 September 2026
  • Home  
  • బ్యాంకింగ్ లావాదేవీల్లో అప్రమత్తత అవసరం: కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ ఉదయ శ్రీ
- పెద్దపల్లి

బ్యాంకింగ్ లావాదేవీల్లో అప్రమత్తత అవసరం: కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ ఉదయ శ్రీ

వెంకటాపూర్‌ లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు మంథని, సెప్టెంబరు 30: బ్యాంకింగ్ డిజిటల్ లావాదేవీల విషయంలో ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ కె. ఉదయశ్రీ సూచించారు. బుధవారం మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలో బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘రమేష్ టీం’ బృందం బుర్రకథ ప్రదర్శన ద్వారా సైబర్ నేరాలు, ఆర్థిక అంశాలపై గ్రామస్థులకు ఆకట్టుకునేలా అవగాహన కల్పించింది.అనంతరం మేనేజర్ ఉదయశ్రీ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు ప్రజల ఆశ, భయాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. లోన్ యాప్‌లు, లాటరీలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు, పాన్ కార్డ్ అప్‌డేట్, ఆధార్ లింకేజీ పేర్లతో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లు, లింక్‌లను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఓటీపీ, ఏటీఎం పిన్, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని, గూగుల్‌లో అనధికార లోన్ యాప్‌ల కోసం వెతకవద్దని కోరారు. ఖాతాదారులు తమ కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు బ్యాంకులో సమర్పించాలని తెలిపారు.రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా పంట రుణాలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, ఆయిల్ పామ్, పాలీహౌస్‌లు, ట్రాక్టర్లు, గోల్డ్ లోన్లు, స్వయం సహాయక సంఘాలు, గృహ నిర్మాణం, వ్యాపారం మరియు విదేశీ విద్య కోసం వివిధ రకాల రుణాలు అందిస్తున్నామని వివరించారు.సహకార బ్యాంకు డిపాజిట్లపై అత్యధికంగా 8 శాతం వడ్డీ కల్పిస్తున్నామని, రూ.436తో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, రూ.20తో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన సౌకర్యాన్ని పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, సర్పంచ్ తోట పోచయ్య, ఉపసర్పంచ్ కీర్తి సాయి, ఫీల్డ్ ఆఫీసర్ సందెబోయిన శ్రీనివాస్, ఎఫ్ ఎల్ సి మోహన్ రావు, బ్యాంకు సిబ్బంది మహేశ్వరి, సహకార సంఘం సిబ్బంది నారామల్ల విద్యాసాగర్, పైడాకుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

వెంకటాపూర్‌ లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

మంథని, సెప్టెంబరు 30:

బ్యాంకింగ్ డిజిటల్ లావాదేవీల విషయంలో ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ కె. ఉదయశ్రీ సూచించారు. బుధవారం మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలో బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘రమేష్ టీం’ బృందం బుర్రకథ ప్రదర్శన ద్వారా సైబర్ నేరాలు, ఆర్థిక అంశాలపై గ్రామస్థులకు ఆకట్టుకునేలా అవగాహన కల్పించింది.అనంతరం మేనేజర్ ఉదయశ్రీ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు ప్రజల ఆశ, భయాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. లోన్ యాప్‌లు, లాటరీలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు, పాన్ కార్డ్ అప్‌డేట్, ఆధార్ లింకేజీ పేర్లతో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లు, లింక్‌లను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఓటీపీ, ఏటీఎం పిన్, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని, గూగుల్‌లో అనధికార లోన్ యాప్‌ల కోసం వెతకవద్దని కోరారు. ఖాతాదారులు తమ కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు బ్యాంకులో సమర్పించాలని తెలిపారు.రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా పంట రుణాలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, ఆయిల్ పామ్, పాలీహౌస్‌లు, ట్రాక్టర్లు, గోల్డ్ లోన్లు, స్వయం సహాయక సంఘాలు, గృహ నిర్మాణం, వ్యాపారం మరియు విదేశీ విద్య కోసం వివిధ రకాల రుణాలు అందిస్తున్నామని వివరించారు.సహకార బ్యాంకు డిపాజిట్లపై అత్యధికంగా 8 శాతం వడ్డీ కల్పిస్తున్నామని, రూ.436తో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, రూ.20తో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన సౌకర్యాన్ని పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, సర్పంచ్ తోట పోచయ్య, ఉపసర్పంచ్ కీర్తి సాయి, ఫీల్డ్ ఆఫీసర్ సందెబోయిన శ్రీనివాస్, ఎఫ్ ఎల్ సి మోహన్ రావు, బ్యాంకు సిబ్బంది మహేశ్వరి, సహకార సంఘం సిబ్బంది నారామల్ల విద్యాసాగర్, పైడాకుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.