బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు రోగులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో 24 మంది రోగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన బీహార్ ప్రభుత్వం ఘటనపై ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది.

బీహార్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి