నాగర్‌కర్నూల్ జిల్లా బీజేవైఎం నూతన అధ్యక్షుడిగా ధన్నోజు నరేష్ చారి ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు గుండె గణేష్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. దశాబ్ద కాలానికి పైగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నరేష్ చారి, కరోనా సమయంలో పేదలకు విశేష సేవలందించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు, పేదల సమస్యలపై పోరాడుతూ యువమోర్చాను జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు


