ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 5 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ఇన్చార్జ్ రవీందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంకట కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో 12 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రధాని పిలుపు మేరకు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అల్లాబాషా, చక్కరమణి, బోలా శీను, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహణ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 5 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ఇన్చార్జ్ రవీందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంకట కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో 12 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రధాని పిలుపు మేరకు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అల్లాబాషా, చక్కరమణి, బోలా శీను, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

