మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాధాకృష్ణవేణి ఆధ్వర్యంలో బుధవా రం ముద్దనూరు గ్రామపంచాయతీ పరిధిలోని డీఎన్పల్లి గ్రామంలో బిన్-బ్యా గ్ విధానంపై ప్రజలకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి కు టుంబం తడి, పొడి చెత్తను తప్పనిసరిగా వేరు చేసి అందించాలని ఎంపీడీఓ సూచించారు. తడి చెత్తను బిన్ (డబ్బా)లో వేసి ప్రతిరోజూ గ్రామపంచాయతీ నుంచి వచ్చే హరిత రాయబారులకు అందించాలని, పొడి చెత్తను బ్యాగ్ (సం చి)లో వేరు చేసి నెలలో రెండుసార్లు గ్రామానికి వచ్చే స్వచ్ఛ రథానికి అందిం చాలని తెలిపారు. పొడి చెత్తను స్వచ్ఛ రథానికి అందించడం ద్వారా కుటుంబా లకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని వివరించారు. గ్రామ ప్రజలు పరి సరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా పారిశుద్ధ్య చర్యలకు సహకరించాలని సూచించారు. అనంతరం ముద్దనూరు గ్రామపంచాయతీలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో మండలంలోని అన్ని గ్రామపంచాయతీల పంచాయతీ అభివృద్ధి అధికారులకు బిన్-బ్యాగ్ విధానం అమలు, ప్రతి ఇంటి నుంచి చెత్తను వేరు చేసి సేకరించే విధానం, తడి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ (వానపాముల ఎరువు) తయారీపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో బిన్-బ్యాగ్ విధానాన్ని సమర్థవంతంగా అ మలు చేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ఎంపీడీఓ సూచించారు. కార్యక్ర మంలో డిప్యూటీ ఎంపిడిఒ వీరభద్రుడు, జిల్లా పంచాయతీ వనరుల శిక్షణ కేం ద్రం రిసోర్స్ పర్సన్ బి. పుల్లారెడ్డి, డి. లక్ష్మీ నరసింహులు, మండలంలోని అన్ని గ్రామపంచాయతీల పంచాయతీ అభివృద్ధి అధికారులు, హరిత రాయబా రులు పాల్గొన్నారు.

బిన్-బ్యాగ్ విధానంతో చెత్త నిర్వహణపై అవగాహన