Thursday, 24 September 2026
  • Home  
  • బిట్టుపల్లిలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రారంభం
- పెద్దపల్లి

బిట్టుపల్లిలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రారంభం

_ప్రజలు సహకరించాలి: గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్_ మంథని, సెప్టెంబర్ 24: జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే2026” లో భాగంగా మంథని మండలం బిట్టుపల్లి గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నట్లు జాతీయ గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంథని ఆర్డీవో సురేష్, తహశీల్దార్ ఆరిఫొద్దీన్, ఎంపీడీవో కంకణాల శ్రీజ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి సర్వే కరపత్రాలను అందజేసి, ఈ కార్యక్రమ లక్ష్యాలను వివరించారు. దేశంలో ఉపాధి, నిరుద్యోగం, కార్మిక శక్తి భాగస్వామ్యం, స్వయం ఉపాధి, వేతనాలపై ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్వే అధికారి మాట్లాడుతూ మొదటి దశలో కుటుంబాల వివరాలు నమోదు చేసి, అనంతరం ఎంపిక చేసిన కుటుంబాలను ప్రతి నెల మొబైల్ ట్యాబ్ ద్వారా పరిశీలిస్తామని తెలిపారు. అలాగే విద్యాభ్యాసం, వృత్తి విద్య, రోజువారీ కూలి, పనిచేసిన గంటలు, మహిళల ఆదాయ వనరుల సమాచారాన్ని నమోదు చేస్తామని తెలియజేశారు. జొమాటో, స్విగ్గీ, రాపిడో, ఓలా, ఉబెర్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేసే గిగ్, ప్లాట్‌ ఫారమ్ కార్మికుల వివరాలను కూడా ఈ సర్వే ద్వారా సేకరిస్తామని అధికారులు తెలిపారు. సర్వే ద్వారా సేకరించిన ప్రతి వివరమూ పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, ప్రజలు ఎలాంటి భయం లేకుండా సరైన సమాచారం అందించి సర్వేను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మంథని డివిజనల్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఎంపీఎస్ఓ సంధ్యారాణి, సర్పంచ్ పోగుల లావణ్య మహేందర్, పంచాయతీ కార్యదర్శి మర్రిపల్లి విజయ్, గువ్వల రాజమల్లు, అంగన్‌వాడీ టీచర్, ఆశా వర్కర్, కారోబార్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

_ప్రజలు సహకరించాలి: గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్_

మంథని, సెప్టెంబర్ 24:

జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే2026” లో భాగంగా మంథని మండలం బిట్టుపల్లి గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నట్లు జాతీయ గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంథని ఆర్డీవో సురేష్, తహశీల్దార్ ఆరిఫొద్దీన్, ఎంపీడీవో కంకణాల శ్రీజ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి సర్వే కరపత్రాలను అందజేసి, ఈ కార్యక్రమ లక్ష్యాలను వివరించారు. దేశంలో ఉపాధి, నిరుద్యోగం, కార్మిక శక్తి భాగస్వామ్యం, స్వయం ఉపాధి, వేతనాలపై ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్వే అధికారి మాట్లాడుతూ మొదటి దశలో కుటుంబాల వివరాలు నమోదు చేసి, అనంతరం ఎంపిక చేసిన కుటుంబాలను ప్రతి నెల మొబైల్ ట్యాబ్ ద్వారా పరిశీలిస్తామని తెలిపారు. అలాగే విద్యాభ్యాసం, వృత్తి విద్య, రోజువారీ కూలి, పనిచేసిన గంటలు, మహిళల ఆదాయ వనరుల సమాచారాన్ని నమోదు చేస్తామని తెలియజేశారు. జొమాటో, స్విగ్గీ, రాపిడో, ఓలా, ఉబెర్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేసే గిగ్, ప్లాట్‌ ఫారమ్ కార్మికుల వివరాలను కూడా ఈ సర్వే ద్వారా సేకరిస్తామని అధికారులు తెలిపారు. సర్వే ద్వారా సేకరించిన ప్రతి వివరమూ పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, ప్రజలు ఎలాంటి భయం లేకుండా సరైన సమాచారం అందించి సర్వేను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మంథని డివిజనల్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఎంపీఎస్ఓ సంధ్యారాణి, సర్పంచ్ పోగుల లావణ్య మహేందర్, పంచాయతీ కార్యదర్శి మర్రిపల్లి విజయ్, గువ్వల రాజమల్లు, అంగన్‌వాడీ టీచర్, ఆశా వర్కర్, కారోబార్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.