నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ పీహెచ్సీని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వైద్య సేవలు, సిబ్బంది హాజరు తీరును ఆయన పరిశీలించారు. ఏఎన్ఎం కిట్లలోని మందులు, వైద్య పరికరాలను తనిఖీ చేసిన కలెక్టర్.. ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి డాక్టర్లు సమయానికి వస్తున్నారా లేదా అని ఆరా తీశారు. పాము కాటు, కుక్క కాటు వ్యాక్సిన్లతో పాటు చిన్నారులకు అవసరమైన టీకాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని అస్సలు సహించబోనని వైద్యాధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో యాదగిరి, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


