ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 7 ఫిర్యాదులు అందినట్లు కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య తెలిపారు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ఫిర్యాదులతో పాటు ప్రతిరోజూ కార్పొరేషన్‌కు వచ్చే దరఖాస్తులను అధికారులు పరిశీలించాలని సూచించారు. ప్రజల సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు బాధ్యతతో పనిచేయాలని కమిషనర్ సూచించారు.



