Wednesday, 23 September 2026
  • Home  
  • *ప్రజా పిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించండి.* *కమిషనర్ ఎం. జయకృష్ణ.*
- తిరుపతి

*ప్రజా పిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించండి.* *కమిషనర్ ఎం. జయకృష్ణ.*

తిరుపతి ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి ప్రజా పిర్యాదుల పరిష్కారం వేదికలో ప్రజల నుండి అందే పిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ అధికారులను ఆదేశించారు. ప్రజా పిర్యాదుల పరిష్కారం వేదికలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను మంగళవారం ఉదయం కమీషనర్ పరిశీలించారు. ముందుగా చేపల మార్కెట్ ను పరిశీలించి దుర్వాసన రాకుండా శుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ వ్యాపారులను ఆదేశించారు. లీలా మహల్ సమీపంలో ఉన్న జంతు వధశాలను పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. జంతు వధశాలలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వినాయక సాగర్ వద్ద గల చెత్త తరలింపు కేంద్రాన్ని పరిశీలించి, శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. శ్రీపురం కాలనీలో డ్రైనేజి కాలువలను పరిశీలించి, చెత్తచెదారం లేకుండా శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లించాలని తెలిపారు. డ్రైనేజి కాలువలు లేని ప్రాంతాల్లో తాత్కాలిక కాలువలు ఏర్పాటు చేసి మురుగునీరు సజావుగా వెళ్లేలా చూడాలని తెలిపారు. మెడిగో హాస్పిటల్ వీధిలో మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను పరిశీలించి వారి సిబ్బందితో సమన్వయం చేసుకుని మెరుగ్గా పారిశుధ్థ్య పనులు చేపట్టాలని సూచించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, తదితరులు ఉన్నారు.

తిరుపతి ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి

ప్రజా పిర్యాదుల పరిష్కారం వేదికలో ప్రజల నుండి అందే పిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ అధికారులను ఆదేశించారు.

ప్రజా పిర్యాదుల పరిష్కారం వేదికలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను మంగళవారం ఉదయం కమీషనర్ పరిశీలించారు. ముందుగా చేపల మార్కెట్ ను పరిశీలించి దుర్వాసన రాకుండా శుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ వ్యాపారులను ఆదేశించారు. లీలా మహల్ సమీపంలో ఉన్న జంతు వధశాలను పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. జంతు వధశాలలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వినాయక సాగర్ వద్ద గల చెత్త తరలింపు కేంద్రాన్ని పరిశీలించి, శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. శ్రీపురం కాలనీలో డ్రైనేజి కాలువలను పరిశీలించి, చెత్తచెదారం లేకుండా శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లించాలని తెలిపారు. డ్రైనేజి కాలువలు లేని ప్రాంతాల్లో తాత్కాలిక కాలువలు ఏర్పాటు చేసి మురుగునీరు సజావుగా వెళ్లేలా చూడాలని తెలిపారు. మెడిగో హాస్పిటల్ వీధిలో మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలను పరిశీలించి వారి సిబ్బందితో సమన్వయం చేసుకుని మెరుగ్గా పారిశుధ్థ్య పనులు చేపట్టాలని సూచించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.