Friday, 18 September 2026
  • Home  
  • పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
- ఖమ్మం

పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

ఖమ్మం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టిందన్నారు. ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం ఉద్యమించిన యోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజా ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. పేదలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిచ్చిందన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మునిసిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాంమూర్తి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.