ఖమ్మం శ్రీనివాసనగర్, వెలుగుమట్ల తదితర ప్రాంతాల్లో పేదల ఇళ్ల కూల్చివేతను తీవ్రంగా నిరసిస్తున్నామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వంలో అధికారుల సమన్వయ లోపం, పాలకుల నిర్లక్ష్యం వల్ల పేదల ఇళ్లను ఇష్టమొచ్చినట్లు కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో GO 58 ద్వారా ఖమ్మంలో దాదాపు 3 వేల మంది పేదలకు స్థల క్రమబద్ధీకరణ పట్టాలు అందించామని తెలిపారు. 2023 ఫిబ్రవరిలో GO 58ను పొడిగించి అర్హులైన పేదలకు కలెక్టర్ సంతకంతో పట్టాలు ఇచ్చామన్నారు. శ్రీనివాసనగర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో 696 పేద కుటుంబాలు లబ్ధి పొందిన విషయాన్ని అధికారులు గుర్తించారని చెప్పారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో BRS లీగల్ సెల్ న్యాయవాదులు రవీందర్, ఖమ్మం బిడ్డ నిరోషా పేదల తరఫున కోర్టులో వాదించారని తెలిపారు. వారం రోజుల్లో సరైన నివేదిక రూపొందించి పేదలకు న్యాయం చేసి, వారి ఇళ్లకు రక్షణ కల్పించాలని న్యాయస్థానం, అధికారులను కోరారు.
కార్యక్రమంలో RJC కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్, పాలడుగు పాపారావు, మాటేటి నాగేశ్వరరావు, మండడుపు రామకృష్ణ, ఖయుమ్, మెంతుల శ్రీశైలం, దడాల రఘు, మస్తాన్, వెంకటేశ్వర్లు, మాటూరి లక్ష్మి నారాయణ, లెలిన్, లీగల్ సెల్ నిరోషా, తిరుమల్ రావు, సుగుణ రావు తదితరులు పాల్గొన్నారు.



