Wednesday, 27 May 2026
  • Home  
  • పేద కుటుంబాలకు రూ.70 వేల అంత్యక్రియల సహాయాన్ని అందించిన కంచి పరమేశ్వర రెడ్డి
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పేద కుటుంబాలకు రూ.70 వేల అంత్యక్రియల సహాయాన్ని అందించిన కంచి పరమేశ్వర రెడ్డి

ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): “మానవత్వమే మతం” అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తూ శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, నిత్యాన్నదాత శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి  మరోసారి తన ఉదార హృదయాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో అంత్యక్రియలు నిర్వహించలేని పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ బుధవారం మొత్తం ఏడు కుటుంబాలకు రూ.70,000 ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.గత రెండేళ్లుగా మున్సిపాలిటీ పరిధిలోని పేద కుటుంబాలకు మాత్రమే అందుతున్న ఈ సేవలను, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడం విశేషం. పేదల కష్టాలను గుర్తించి కులమతాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి ధైర్యం చెబుతూ సహాయం అందించడం స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.ఈ సందర్భంగా మహిమలూరు బీసీ కాలనీకి చెందిన పందిళ్ళపల్లి శ్రీనివాసులు (49) కుటుంబానికి, వెన్నవాడ ఎస్సీ కాలనీకి చెందిన కోనా తిరుపతి (50) కుటుంబానికి, అప్పారావుపాలెం ఎస్సీ కాలనీకి చెందిన కొట్టి ఆదిలక్ష్మమ్మ (60) కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు ఎల్‌ఆర్ పల్లికి చెందిన సిద్ధంశెట్టి ప్రభావతి (72) కుటుంబానికి, 12వ వార్డుకు చెందిన మొద్దు మహాలక్ష్మమ్మ (34) కుటుంబానికి, 17వ వార్డు టేక్కే ఏరియాకు చెందిన అబ్దుల్ సలాం (52) కుటుంబానికి, 23వ వార్డు టీట్కో కాలనీకి చెందిన పూజారి చిన్నమ్మ (72) కుటుంబ సభ్యులకు కూడా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కంచి పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ, “ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ తమ కుటుంబ సభ్యుల అంత్యక్రియలు నిర్వహించడంలో ఇబ్బందులు పడకూడదు అనేదే నా సంకల్పం” అని తెలిపారు. పేద కుటుంబాలకు అండగా నిలబడటం తన సామాజిక బాధ్యతగా భావిస్తున్నానన్నారు.ఇప్పటికే ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకుల కోసం నిరంతర అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వేలాది మందికి భోజన సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు ఉచిత అన్నప్రసాదం అందిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా పేదరికాన్నే ప్రాతిపదికగా తీసుకుని సహాయం అందించడం గొప్ప విషయమని స్థానిక ప్రజలు కొనియాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ సేవలను విస్తరించడం వల్ల మరింత మంది పేదలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.


ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): “మానవత్వమే మతం” అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తూ శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, నిత్యాన్నదాత శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి  మరోసారి తన ఉదార హృదయాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో అంత్యక్రియలు నిర్వహించలేని పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ బుధవారం మొత్తం ఏడు కుటుంబాలకు రూ.70,000 ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.గత రెండేళ్లుగా మున్సిపాలిటీ పరిధిలోని పేద కుటుంబాలకు మాత్రమే అందుతున్న ఈ సేవలను, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడం విశేషం. పేదల కష్టాలను గుర్తించి కులమతాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి ధైర్యం చెబుతూ సహాయం అందించడం స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.ఈ సందర్భంగా మహిమలూరు బీసీ కాలనీకి చెందిన పందిళ్ళపల్లి శ్రీనివాసులు (49) కుటుంబానికి, వెన్నవాడ ఎస్సీ కాలనీకి చెందిన కోనా తిరుపతి (50) కుటుంబానికి, అప్పారావుపాలెం ఎస్సీ కాలనీకి చెందిన కొట్టి ఆదిలక్ష్మమ్మ (60) కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు ఎల్‌ఆర్ పల్లికి చెందిన సిద్ధంశెట్టి ప్రభావతి (72) కుటుంబానికి, 12వ వార్డుకు చెందిన మొద్దు మహాలక్ష్మమ్మ (34) కుటుంబానికి, 17వ వార్డు టేక్కే ఏరియాకు చెందిన అబ్దుల్ సలాం (52) కుటుంబానికి, 23వ వార్డు టీట్కో కాలనీకి చెందిన పూజారి చిన్నమ్మ (72) కుటుంబ సభ్యులకు కూడా చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా కంచి పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ, “ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ తమ కుటుంబ సభ్యుల అంత్యక్రియలు నిర్వహించడంలో ఇబ్బందులు పడకూడదు అనేదే నా సంకల్పం” అని తెలిపారు. పేద కుటుంబాలకు అండగా నిలబడటం తన సామాజిక బాధ్యతగా భావిస్తున్నానన్నారు.ఇప్పటికే ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకుల కోసం నిరంతర అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వేలాది మందికి భోజన సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు ఉచిత అన్నప్రసాదం అందిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా పేదరికాన్నే ప్రాతిపదికగా తీసుకుని సహాయం అందించడం గొప్ప విషయమని స్థానిక ప్రజలు కొనియాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ సేవలను విస్తరించడం వల్ల మరింత మంది పేదలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.