*
పెళ్లకూరు మండలం ఆర్లపాడు పాఠశాల అభివృద్ధి కమిటీ ఎన్నికలు రసాభసగా మారాయి. 14 మంది సభ్యుల మధ్యతో మణికరి దేవిక చైర్మన్ గా ఎన్నికయ్యారు.
ఈ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కూటమి నాయకులు డిమాండ్ చేశారు.
ఇదే అంశంపై వార్తా సేకరణకు వెళ్లిన ఇద్దరు విలేకరులపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విలేకరులపై దాడిని పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.


