Monday, 14 September 2026
  • Home  
  • పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్‌ను యథావిధిగా నిర్వహించాలి:-కలెక్టర్, నిశాంతి
- అల్లూరి సీతారామరాజు

పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్‌ను యథావిధిగా నిర్వహించాలి:-కలెక్టర్, నిశాంతి

[13/09, 7:25 pm] Laxman Regam@Reporter: ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్‌)లో భాగంగా పీజీఆర్ఎస్‌ రెవెన్యూ క్లినిక్‌ను యథావిధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌,టి.నిశాంతి, అధికారులను ఆదేశించారు.జిల్లాలోని పీజీఆర్ఎస్‌ కేంద్రాల్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమగ్రంగా పరిశీలించి సత్వర పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్హత పత్రాలు, అవసరమైన వివరాలతో నేరుగా హాజరై అర్జీలు సమర్పించుకోవచ్చని తెలిపారు. పీజీఆర్ఎస్‌ కార్యక్రమానికి నేరుగా హాజరు కాలేని ప్రజలు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చని, అలాగే మీకోసం వెబ్‌సైట్‌ (meekosam.ap.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్‌ తెలిపారు. ఇప్పటికే సమర్పించిన అర్జీల స్థితి, పరిష్కార పురోగతిని తెలుసుకునేందుకు కూడా 1100 నంబర్‌ను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్‌ సేవలను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందించేందుకు జిల్లా, మండల స్థాయి కేంద్రాల్లో సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ సూచించారు. సంబంధిత సేవలను పొందిన అనంతరం ప్రజలు తమ మొబైల్‌ ఫోన్‌తో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి సేవలపై తమ అనుభవం, అభిప్రాయాలను నమోదు చేయాలని కోరారు. పీజీఆర్ఎస్‌లో పరిష్కరించిన ఫిర్యాదులపై ప్రజల నుంచి వచ్చే అసంతృప్తి స్పందనలను జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా సమీక్షించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఫిర్యాదుదారులతో సంబంధిత అధికారులు నేరుగా మాట్లాడి సమస్య స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకుని, వారికి సంతృప్తికరమైన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం, 1100 కాల్‌ సెంటర్‌, సూపర్‌ ఆడిట్‌ తదితర మార్గాల ద్వారా గుర్తించే అసంతృప్తి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం లేదా విధి నిర్వహణలో లోపాలు ఉన్నట్లు తేలితే బాధ్యులైన అధికారులపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడంతో పాటు, చేపట్టిన చర్యల నివేదికను సమర్పించాలని స్పష్టం చేశారు.

[13/09, 7:25 pm] Laxman Regam@Reporter: ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్‌)లో భాగంగా పీజీఆర్ఎస్‌ రెవెన్యూ క్లినిక్‌ను యథావిధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌,టి.నిశాంతి, అధికారులను ఆదేశించారు.జిల్లాలోని పీజీఆర్ఎస్‌ కేంద్రాల్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమగ్రంగా పరిశీలించి సత్వర పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్హత పత్రాలు, అవసరమైన వివరాలతో నేరుగా హాజరై అర్జీలు సమర్పించుకోవచ్చని తెలిపారు.

పీజీఆర్ఎస్‌ కార్యక్రమానికి నేరుగా హాజరు కాలేని ప్రజలు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చని, అలాగే మీకోసం వెబ్‌సైట్‌ (meekosam.ap.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్‌ తెలిపారు. ఇప్పటికే సమర్పించిన అర్జీల స్థితి, పరిష్కార పురోగతిని తెలుసుకునేందుకు కూడా 1100 నంబర్‌ను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.

పీజీఆర్ఎస్‌ సేవలను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందించేందుకు జిల్లా, మండల స్థాయి కేంద్రాల్లో సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ సూచించారు. సంబంధిత సేవలను పొందిన అనంతరం ప్రజలు తమ మొబైల్‌ ఫోన్‌తో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి సేవలపై తమ అనుభవం, అభిప్రాయాలను నమోదు చేయాలని కోరారు.

పీజీఆర్ఎస్‌లో పరిష్కరించిన ఫిర్యాదులపై ప్రజల నుంచి వచ్చే అసంతృప్తి స్పందనలను జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా సమీక్షించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

ఫిర్యాదుదారులతో సంబంధిత అధికారులు నేరుగా మాట్లాడి సమస్య స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకుని, వారికి సంతృప్తికరమైన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కార్యాలయం, 1100 కాల్‌ సెంటర్‌, సూపర్‌ ఆడిట్‌ తదితర మార్గాల ద్వారా గుర్తించే అసంతృప్తి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం లేదా విధి నిర్వహణలో లోపాలు ఉన్నట్లు తేలితే బాధ్యులైన అధికారులపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడంతో పాటు, చేపట్టిన చర్యల నివేదికను సమర్పించాలని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.