చిట్వేల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పారిశుధ్య కార్మికులను పోలీసులు ఘనంగా సన్మానించారు. చిట్వేల్ ఎస్‌ఐ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి అభినందించారు. కార్మికులకు శాలువాలు కప్పి, స్వీట్ల బాక్సులు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతను కాపాడటంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజల కోసం విధులు నిర్వహిస్తున్న వారి సేవలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ యంగయ్య, హెడ్ కానిస్టేబుల్ రాజు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పారిశుధ్య కార్మికులకు పోలీసుల ఘన సన్మానం