తిరుమలాయపాలెం / ఖమ్మం
ఖమ్మం జిల్లా బీజేపీ కార్యదర్శి తమ్మేరా రజని రెడ్డి భర్త పాపిరెడ్డి మృతి చెందడంతో బీజేపీ నాయకులు సంతాపం తెలిపారు. తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామంలో పాపిరెడ్డి స్వగృహానికి వెళ్లిన ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మందా సరస్వతి, జిల్లా కార్యదర్శి శ్రీరామనేని మణి ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాపిరెడ్డి కుటుంబానికి పార్టీ నాయకులు అండగా ఉంటారని పేర్కొన్నారు.



