పల్నాడు జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్ ఎత్తిపోతల వద్ద అడ్వెంచర్ కార్యకలాపాలు ప్రారంభం.*
ఎత్తిపోతలలో సరికొత్త అడ్వెంచర్స్:
పల్నాడు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఎతిపోతల జలపాతం వద్ద జిప్‌లైన్, జిప్ సైకిల్ అడ్వెంచర్ కార్యకలాపాలు ప్రారంభం.
పర్యాటక శాఖ సహకారంతో రెయిన్బో ఎంటర్టైన్మెంట్స్ ఏర్పాటు చేసిన ఈ సాహస క్రీడలను ప్రారంభించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి.
నాగార్జునకొండ మ్యూజియం కోసం సుమారు రూ. 16 లక్షల విలువైన రెండు బ్యాటరీ వాహనాలను అందజేసిన కలెక్టర్, ఎమ్మెల్యే.
ఆకాశంలో సాహసం చేసే జిప్‌లైన్, ఎత్తైన ప్రదేశంలో సైకిల్ తొక్కే జిప్ సైకిల్‌తో పాటు పిల్లల కోసం ప్రత్యేకంగా ఫన్‌జోన్ ఏర్పాటు.
పర్యాటకుల రక్షణ కోసం అంతర్జాతీయ ప్రమాణాల సేఫ్టీ
పరికరాలు, శిక్షణ పొందిన ప్రత్యేక సిబ్బంది అందుబాటు.
రూ. 1.71 కోట్ల పెట్టుబడి: సుమారు 1.71 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి, వ్యాపారాలకు పెరగనున్న ఆదరణ.


