నిద్రమత్తుకు నో చెప్పండి.. ప్రమాదాలను నివారించండి స్టాప్ • ఫేస్ వాష్ • అండ్ గో
*రోడ్డు ప్రమాదాల నివారణకు కడప జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యక్రమం*
జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారుల భద్రతే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలను నిరంతరం కొనసాగిస్తోంది.
👉 అర్ధరాత్రి తర్వాత ప్రత్యేక నిఘా
రాత్రి వేళల్లో, ముఖ్యంగా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధాన రహదారులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. నిద్రమత్తు లేదా అలసటతో వాహనాలు నడుపుతున్న డ్రైవర్లను గుర్తించి అప్రమత్తం చేస్తున్నారు.
🚛 లారీలు | 🚌 బస్సులు | 🚗 కార్లు | 🚐 ఇతర వాహనాలు
వాహనాలను ఆపి డ్రైవర్లకు నీటితో ముఖం కడిగించి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాతే ప్రయాణం కొనసాగించాలని పోలీసులు సూచిస్తున్నారు.
⚠️ డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు
🔹 నిద్రమత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపవద్దు.
🔹 అలసటగా అనిపిస్తే వెంటనే వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో నిలిపి విశ్రాంతి తీసుకోండి.
🔹 నిరంతరంగా డ్రైవింగ్ చేయకుండా మధ్య మధ్యలో విరామం తీసుకోండి.
🔹 డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండండి.. మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉండండి.
🔹 మీ ప్రాణాలతో పాటు రహదారిపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలను కూడా కాపాడండి.
🛑 “కొద్దిసేపు ఆగండి.. ముఖం కడుక్కోండి.. విశ్రాంతి తీసుకోండి.. సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోండి.”
మీ అప్రమత్తతే.. మీ కుటుంబానికి భద్రత.
నిద్రమత్తులో డ్రైవింగ్ వద్దు.

నిద్రమత్తుకు నో చెప్పండి.. ప్రమాదాలను నివారించండి స్టాప్ • ఫేస్ వాష్ • అండ్ గో
నిద్రమత్తుకు నో చెప్పండి.. ప్రమాదాలను నివారించండి స్టాప్ • ఫేస్ వాష్ • అండ్ గో *రోడ్డు ప్రమాదాల నివారణకు కడప జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యక్రమం* జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారుల భద్రతే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలను నిరంతరం కొనసాగిస్తోంది. 👉 అర్ధరాత్రి తర్వాత ప్రత్యేక నిఘా రాత్రి వేళల్లో, ముఖ్యంగా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధాన రహదారులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. నిద్రమత్తు లేదా అలసటతో వాహనాలు నడుపుతున్న డ్రైవర్లను గుర్తించి అప్రమత్తం చేస్తున్నారు. 🚛 లారీలు | 🚌 బస్సులు | 🚗 కార్లు | 🚐 ఇతర వాహనాలు వాహనాలను ఆపి డ్రైవర్లకు నీటితో ముఖం కడిగించి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాతే ప్రయాణం కొనసాగించాలని పోలీసులు సూచిస్తున్నారు. ⚠️ డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు 🔹 నిద్రమత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపవద్దు. 🔹 అలసటగా అనిపిస్తే వెంటనే వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో నిలిపి విశ్రాంతి తీసుకోండి. 🔹 నిరంతరంగా డ్రైవింగ్ చేయకుండా మధ్య మధ్యలో విరామం తీసుకోండి. 🔹 డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండండి.. మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉండండి. 🔹 మీ ప్రాణాలతో పాటు రహదారిపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలను కూడా కాపాడండి. 🛑 “కొద్దిసేపు ఆగండి.. ముఖం కడుక్కోండి.. విశ్రాంతి తీసుకోండి.. సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోండి.” మీ అప్రమత్తతే.. మీ కుటుంబానికి భద్రత. నిద్రమత్తులో డ్రైవింగ్ వద్దు.

