మహిమలూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 53 రోజుల అక్రమ నిర్బంధాన్ని గుర్తు చేసుకుంటూ మహిమలూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారి నిర్బంధానికి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నిరసన చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు నాయుడు చేసిన పోరాటాన్ని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. నిజం చివరకు గెలిచిందని పేర్కొంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నిజం గెలిచింది.. చంద్రబాబు 53 రోజుల అక్రమ నిర్బంధంపై మహిమలూరులో నిరసన