ఎల్బీనగర్: నాగోల్ లో కేఎఫ్‌సీ పక్కన, పిల్లర్ నంబర్ 12 వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ మాంక్ కేఫ్ (ఫైన్ డైన్ అండ్ బేకింగ్ )కి ముఖ్య అతిధిగా ఈ గురుకులం ఫౌండర్ ఆకెళ్ళ రాఘవేంద్ర (ఐఎఎస్ ) హాజరై అర్బన్ మాంక్ కేఫ్ సీఈవో దుండిగళ్ళ రాఘవేంద్ర తో కలిసి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను సరసమైన ధరలకు అందించాలని వారు సూచించారు. నిర్వాహకులు వ్యాపార రంగంలో ఆర్థికంగా ఎదుగుతూ నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అనంతరం అర్బన్ మాంక్ కేఫ్ సీఈఓ రాఘవేంద్ర మాట్లాడుతూ..తమ కేఫ్‌లో కాఫీ, కేక్స్, డెజర్ట్స్, బిర్యానీ, తందూరీ, చైనీస్, కాంటినెంటల్ తదితర ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
నాగోల్ పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఫుడ్‌తో పాటు ఆహ్లాదకరమైన డైనింగ్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా కేఫ్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తమ కేఫ్ ను సందర్శించి వంటకాలను ఆస్వాదించగలరని కోరారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధు మిత్రులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






