ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి
భైంసా మున్సిపాలిటీ
నాగుల పంచమి పండుగ రోజున భైంసా పట్టణంలోని ఏపీ నగర్, గోపాల్ నగర్, శాస్త్రి నగర్, సంబాజి చౌక్ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పండుగ రోజు కావడంతో ఇంటి వద్ద పూజలు నిర్వహించుకునేందుకు నీరు అవసరం కాగా, సరఫరా లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు..పండుగ సమయాల్లోనే తరచూ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండటంపై ఆయా ప్రాంతాల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళికతో పండుగ రోజుల్లోనైనా నిరంతర నీటి సరఫరా అందించాలని వారు అధికారులను కోరుతున్నారు.




1 Comment
ఓటర్ డ్రాప్ట్ లిస్ట్ విడుదల మీ ఓటు చెక్ చేసుకోండి
August 17, 2026TG లో సార్ ఓటర్ల డ్రాప్ట్ విడుదలయింది మొత్తం 3.38కోట్లకు పైన ఓటర్లు ఉండగా ఇప్పటివరకు 2.65కోట్ల మంది (78.31%)మంది మాత్రమే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారు మరో 58.21 లక్షలా మంది వివరాలు అందుబాటులో లేకపోవడం తొ వారి వివరాలు పెండింగ్ లో పడ్డాయి మీ పేరు లిస్ట్ లో ఉందో లేదో వెబ్ సైట్ లో చెక్ చేసుకోండి లేని వారు ఫారం 6తొ BLO ని సంప్రదించండి