వార్త ముఖ్యాంశాలు
- RDOకు అర్జీ అందజేసిన తోడేటి అశోక్ ఆత్మకూరు, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు–నల్లపరెడ్డిపల్లి–మురగళ్ల–కనుపూరుపల్లి రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తోడేటి అశోక్ తెలిపారు.
- రహదారి పనులను వెంటనే ప్రారంభించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరారు.
- గతంలో జేసీబీతో రహదారి పనులు ప్రారంభించి, అనంతరం పనులు నిలిచిపోవడంతో రహదారిని అస్తవ్యస్తంగా వదిలేశారని ఆయన తెలిపారు.
RDOకు అర్జీ అందజేసిన తోడేటి అశోక్
ఆత్మకూరు, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు–నల్లపరెడ్డిపల్లి–మురగళ్ల–కనుపూరుపల్లి రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తోడేటి అశోక్ తెలిపారు. రహదారి పనులను వెంటనే ప్రారంభించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరారు.
గతంలో జేసీబీతో రహదారి పనులు ప్రారంభించి, అనంతరం పనులు నిలిచిపోవడంతో రహదారిని అస్తవ్యస్తంగా వదిలేశారని ఆయన తెలిపారు. గతంలో మంజూరైన పనులు రద్దయ్యాయని, ప్రస్తుతం తిరిగి రహదారి పనులకు అనుమతి వచ్చినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై స్పష్టత లేదన్నారు.
ఈ సమస్యపై సంబంధిత PIU ఏఈ అధికారిని పలుమార్లు కలిసి సమస్యను వివరించడంతో పాటు RTI ద్వారా వివరాలు కోరినట్లు తెలిపారు. అలాగే నెల్లూరు కార్యాలయాన్ని కూడా సంప్రదించినట్లు చెప్పారు.ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో రహదారి పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఆత్మకూరు RDOకు అర్జీ సమర్పించారు.ఈ కార్యక్రమంలో సుమంత్, హరిబాబు, బద్రి, రాజా, వెంకటేష్‌తో పాటు నల్లపరెడ్డిపల్లి, మురగళ్ల, కనుపూరుపల్లి గ్రామాలకు చెందిన యువత పాల్గొన్నారు.