బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రెండు సంవత్సరాలల్లో కెసిఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని బి ఆర్ ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే నర్సంపేట లోని మెడికల్ కళాశాలకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతాం అని అన్నారు.
ఎన్నాళ్లు బతికామన్నది కాదు ఎట్ల బతికామన్నదే ముఖ్యమని తెలిపారు. పెద్ది అంతిమయాత్రలో లక్ష మంది జనం వచ్చారు పెద్ది ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు
పెద్ది జన్మ ధన్యమైందని కేటీఆర్ తెలిపారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర గురించి హైదరాబాద్లో మిత్రుడు తనను అడిగారని ఉద్యమ బిడ్డకు ఉద్యమ గడ్డ ఓరుగల్లు ఇచ్చిన గౌరవం ఉద్యమ యాత్ర కు తరలివచ్చిన ప్రజలను చూస్తే అర్థమవుతుంది అని కేటీఆర్ అన్నారు.



