దుత్తలూరు,
జూలై 16:07:2026 (పున్నమి ప్రతినిధి )
నందిపాడు సెంటర్లో ప్రజలు, వ్యాపారులలో సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు డ్రగ్స్ నివారణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉదయగిరి సీఐ శ్రీనివాసరావు మరియు దుత్తలూరు నూతన ఎస్ఐ సుభాషిణి గారు పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం వ్యక్తి, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.
అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు.
సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ, అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, అనుమానాస్పద లింకులను నమ్మవద్దని, మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
ఈ సందర్భంగా నందిపాడు సెంటర్లోని వ్యాపారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసుల సూచనలను ఆసక్తిగా విన్నారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.



