వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు–ఉదయగిరి ప్రధాన మార్గంలోని నందవరం వద్ద రహదారి మార్జిన్లు వర్షాలకు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
- రహదారికి ఇరువైపులా మార్జిన్లు దెబ్బతినడంతో వాహనాలు సాఫీగా వెళ్లలేకపోయాయి.
- దీంతో సుమారు 45 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.
నెల్లూరు–ఉదయగిరి ప్రధాన మార్గంలోని నందవరం వద్ద రహదారి మార్జిన్లు వర్షాలకు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారికి ఇరువైపులా మార్జిన్లు దెబ్బతినడంతో వాహనాలు సాఫీగా వెళ్లలేకపోయాయి. దీంతో సుమారు 45 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ కారణంగా ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర పనులపై వెళ్లేవారు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారి మార్జిన్లకు మరమ్మతులు చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.