Friday, 31 July 2026
  • Home  
  • నందలూరులో ఆర్ఎంపీ క్లినిక్ ల తనిఖీలు…నిబంధనలు పాటించాలని హెచ్చరిక పున్నమి ప్రతినిధి జూలై 31.
- కడప

నందలూరులో ఆర్ఎంపీ క్లినిక్ ల తనిఖీలు…నిబంధనలు పాటించాలని హెచ్చరిక పున్నమి ప్రతినిధి జూలై 31.

కడప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శరత్ కమల్ నందలూరు లోని ఆర్ఎంపి చికిత్స కేంద్రాలను సందర్శించారు. ఈసందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలకు ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాలని పేరుకు ముందు డాక్టర్ అని రాయకూడదని, ఎలాంటి ద్రావనాలు, సూదిమందు ఎక్కించరాదని,స్టేరాయిడ్స్,మత్తుమందులు ఆంటిబయోటిక్స్ ఇవ్వరాదని సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అవసరమైన వారికి చికిత్స కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి పంపవలెనని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది సి హెచ్ ఓ వెంకట నారాయణ,సూపర్వైసర్ సునీల్, ఎమ్ ఎల్ హెచ్ పి ఆరిఫ్ పాల్గొన్నారు.

కడప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శరత్ కమల్ నందలూరు లోని ఆర్ఎంపి చికిత్స కేంద్రాలను సందర్శించారు.
ఈసందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలకు ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాలని పేరుకు ముందు డాక్టర్ అని రాయకూడదని, ఎలాంటి ద్రావనాలు, సూదిమందు ఎక్కించరాదని,స్టేరాయిడ్స్,మత్తుమందులు ఆంటిబయోటిక్స్ ఇవ్వరాదని సూచించారు.
నిబంధనలను అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అవసరమైన వారికి చికిత్స కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి పంపవలెనని సూచించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది సి హెచ్ ఓ వెంకట నారాయణ,సూపర్వైసర్ సునీల్, ఎమ్ ఎల్ హెచ్ పి ఆరిఫ్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.