ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి వినతి.. పౌర హక్కుల దినోత్సవ గ్రామసభలు నిర్వహించాలని విజ్ఞప్తి
దుత్తలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ జిల్లా మహిళా కన్వీనర్ ఎన్. జయశ్రీ, నెల్లూరు నగర అధ్యక్షురాలు సీహెచ్. నాగమణి, కార్యదర్శి ఎం. శైలజలు తహసీల్దార్ నాగరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రతినెల చివరి రోజున పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామసభలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. మండల స్థాయిలో విజిలెన్స్, మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని, భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
దుత్తలూరు తహసీల్దార్‌ను కలిసిన ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ కమిటీ మహిళా నేతలు
ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి వినతి.. పౌర హక్కుల దినోత్సవ గ్రామసభలు నిర్వహించాలని విజ్ఞప్తి దుత్తలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ జిల్లా మహిళా కన్వీనర్ ఎన్. జయశ్రీ, నెల్లూరు నగర అధ్యక్షురాలు సీహెచ్. నాగమణి, కార్యదర్శి ఎం. శైలజలు తహసీల్దార్ నాగరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రతినెల చివరి రోజున పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామసభలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. మండల స్థాయిలో విజిలెన్స్, మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని, భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

