Tuesday, 2 June 2026
  • Home  
  • దర్జాగా కబ్జా….
- విశాఖపట్నం

దర్జాగా కబ్జా….

దువ్వాడలో ప్రభుత్వ భూమికి రక్షణ కరువా..? రూ.3 కోట్ల విలువైన స్థలంలో యథేచ్ఛగా నిర్మాణాలు ఫిర్యాదులు వెల్లువెత్తినా స్పందించని అధికారులు విశాఖపట్నం: (పున్నమి ప్రతినిధి) గాజువాక మండలం దువ్వాడ గ్రామంలో ప్రభుత్వ భూముల పరిరక్షణపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్టార్-1 సచివాలయ పరిధిలోని సర్వే నెంబర్ 140/5లో ఉన్న సుమారు రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ ఆస్తిగా నమోదైన ఈ భూమిపై గతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుతం వాటిని పట్టించుకోకుండా నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు ఉన్నాయా..? యాజమాన్య హక్కులు ఎవరివి..? అనే ప్రశ్నలకు స్పష్టత లేకుండానే నిర్మాణాలు పూర్తికి చేరువ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే అంశంపై గతంలో పలుమార్లు ఫిర్యాదులు అందజేసినా, పలు వార్తా కథనాలు వెలువడినా సంబంధిత శాఖలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిపై నిర్మాణాలు కొనసాగుతుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్న ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. భూములను పరిరక్షించాల్సిన యంత్రాంగం మౌనం పాటించడం వెనుక ప్రభావశీలుల అండదండలు ఉన్నాయా..? లేక అధికారుల నిర్లక్ష్యమా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తి కళ్లముందే ఆక్రమణకు గురవుతుంటే సంబంధిత శాఖలు స్పందించకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ప్రభుత్వ భూముల పరిరక్షణ కేవలం ప్రకటనలకే పరిమితమైందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని సర్వే నెంబర్ 140/5లో జరుగుతున్న నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు నిర్ధారణ అయితే నిర్మాణాలను వెంటనే నిలిపివేసి, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

దువ్వాడలో ప్రభుత్వ భూమికి రక్షణ కరువా..?
రూ.3 కోట్ల విలువైన స్థలంలో యథేచ్ఛగా నిర్మాణాలు
ఫిర్యాదులు వెల్లువెత్తినా స్పందించని అధికారులు

విశాఖపట్నం: (పున్నమి ప్రతినిధి)

గాజువాక మండలం దువ్వాడ గ్రామంలో ప్రభుత్వ భూముల పరిరక్షణపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్టార్-1 సచివాలయ పరిధిలోని సర్వే నెంబర్ 140/5లో ఉన్న సుమారు రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ ఆస్తిగా నమోదైన ఈ భూమిపై గతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుతం వాటిని పట్టించుకోకుండా నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు ఉన్నాయా..? యాజమాన్య హక్కులు ఎవరివి..? అనే ప్రశ్నలకు స్పష్టత లేకుండానే నిర్మాణాలు పూర్తికి చేరువ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే అంశంపై గతంలో పలుమార్లు ఫిర్యాదులు అందజేసినా, పలు వార్తా కథనాలు వెలువడినా సంబంధిత శాఖలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిపై నిర్మాణాలు కొనసాగుతుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్న ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. భూములను పరిరక్షించాల్సిన యంత్రాంగం మౌనం పాటించడం వెనుక ప్రభావశీలుల అండదండలు ఉన్నాయా..? లేక అధికారుల నిర్లక్ష్యమా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తి కళ్లముందే ఆక్రమణకు గురవుతుంటే సంబంధిత శాఖలు స్పందించకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ప్రభుత్వ భూముల పరిరక్షణ కేవలం ప్రకటనలకే పరిమితమైందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని సర్వే నెంబర్ 140/5లో జరుగుతున్న నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు నిర్ధారణ అయితే నిర్మాణాలను వెంటనే నిలిపివేసి, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.