శ్రీ కాళహస్తి, మే 27, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజికవర్గంలో మహానాడు–2026 వేడుకల్లో భాగంగా తొట్టంబేడు మండలంలోని 11, 12 క్లస్టర్ల వర్చువల్ కార్యక్రమాల్లో నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెదేపా నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభా ప్రాంగణంలో కేడర్‌తో కలిసి మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశక ప్రసంగం పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. ఈసారి మహానాడు థీమ్ ‘స్త్రీ శక్తి’ కావడం, నారా లోకేష్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు ఇదే కావడంతో నియోజకవర్గ కేడర్‌లో పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు. కూటమి ప్రభుత్వ ప్రజారక్షణ పాలనలో పసుపు జెండాను మరింత ఎత్తుకు ఎగరేస్తూ, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రగతి కోసం అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

తొట్టంబేడులో మహానాడు వేడుకలు-వర్చువల్ స్క్రీనింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి