తణుకు మండలం తేతలి వై జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరగవరం మండలం కొడవల్లి గ్రామానికి చెందిన తండ్రి, కుమారుడు కొమ్మూరి లక్ష్మీ సత్యనారాయణ, ఆదినారాయణ బైక్ పై వెళ్తుండగా ,టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమారుడు లక్ష్మి సత్యనారాయణ కు తీవ్ర గాయాలు కాగా, తండ్రి ఆదినారాయణ స్వల్ప గాయాలతో బయటపడ్డారు . కుమారుడు లక్ష్మీ సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు.



