టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌లో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు.
చంద్రబాబు గారి నాయకత్వంపై ‘సీఈవో సీఎం టు వాటర్‌మ్యాన్’ తీర్మానం.
హర్షధ్వానాలతో మద్దతు తెలిపిన టీడీపీ నేతలు.
మంగళగిరి, సెప్టెంబర్ 7:
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రెండు రోజుల లీడర్షిప్ కాంక్లేవ్‌లో మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో సోమవారం ప్రారంభమైన ఈ కాంక్లేవ్‌లో పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ గారుతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిలు, పార్లమెంట్ పరిశీలకులు పాల్గొన్నారు.
కాంక్లేవ్ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భవన్‌లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మా తెలుగు తల్లి గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పార్టీ అధినాయకత్వం సూచనలు, ప్రజాప్రతినిధుల పనితీరు, పార్టీ–ప్రభుత్వ సమన్వయం, ప్రజలతో మరింత అనుసంధానం వంటి కీలక అంశాలపై నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు గారి నాయకత్వంపై తీర్మానం
కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని వివరిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ‘సీఈవో సీఎం టు వాటర్‌మ్యాన్’ పేరుతో తీర్మానాన్ని ప్రతిపాదించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పరిపాలనా అనుభవం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు గారు చేసిన ప్రసంగానికి కాంక్లేవ్‌లో పాల్గొన్న టీడీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు హర్షధ్వానాలతో మద్దతు తెలిపారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ నేతలు లేచి నిలబడి తీర్మానానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పార్టీ కేడర్‌కు అభివాదం చేశారు.
టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ రెండు రోజుల లీడర్షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి కాంక్లేవ్‌లో జరుగుతున్న శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజాప్రతినిధుల పనితీరు, పార్టీ–ప్రభుత్వ సమన్వయం తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.
పది కీలక అంశాలపై శిక్షణ
రెండు రోజుల పాటు జరిగే లీడర్షిప్ కాంక్లేవ్‌లో ప్రజాప్రతినిధుల పనితీరు, పార్టీ–ప్రభుత్వ సమన్వయం, ప్రజలతో అనుసంధానం సహా పది కీలక అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.
ప్రజల సమస్యలను మరింత సమర్థవంతంగా తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకోవడం, పార్టీ కేడర్‌ను కలుపుకుని ముందుకు సాగడం, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా చేరవేయడం వంటి అంశాలపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న వసంత వెంకట కృష్ణప్రసాదు గారు, మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంక్లేవ్‌లో పాల్గొని పార్టీ అధినాయకత్వం నుంచి కీలక సూచనలు స్వీకరించారు.
పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజాప్రతినిధుల పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ లీడర్షిప్ కాంక్లేవ్‌లో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు చురుగ్గా పాల్గొంటున్నారు



