వేల్పూర్ మండలం లోగల రైతు వేదికలో తెలంగాణ జలసిరి పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి మండల స్పెషల్ ఆఫీసర్ భారతి మేడం గారు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీవో బాలకిషన్ గారు మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావం వలన వర్షాలు తక్కువ పడుతున్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలి,గ్రౌండ్ వాటర్ పెరగడానికి వీబీజీ రామ్ జి లో పథకం లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని తెలిపారు
తరువాత ఏ పీ ఓ అశోక్ గారు ఇంకుడు గుంతల గురించి, కమ్యూనిటీ సోక్ పిట్ గురించి, బోర్వెల్ రీఛార్జ్ గురించి, రైతుల పొలాలలో ఫాం పౌండ్స్ గురించి,వాటి కొలతలు మరియు అంచనా విలువలు మరియు వాటి వలన ఉపయోగాలు గురించి వివరించడం జరిగింది.
సర్పంచుల ఫోరం అధ్యక్షులు పడగల్ గ్రామ సర్పంచ్ గారు మాట్లాడుతూ అన్ని గ్రామాలలో ఇంకుడు గుంతలు చేయించడానికి సర్పంచుల సహకారం ఉంటుందని తెలిపారు.
సభకు అధ్యక్షత వహించినటువంటి స్పెషల్ ఆఫీసర్ మేడం గారు మాట్లాడుతూ ప్రతి మహిళా రైతు ఫాంపౌండ్ నిర్మించుకోవాలని FAMPOND వలన చాలా లాభాలు ఉన్నాయని నీటిని పొదుపుగా వాడుకోవాలని మాట్లాడడం జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో అన్ని గ్రామాల గ్రామ సర్పంచులు అన్ని గ్రామ పంచాయతీల మహిళా గ్రామ సంఘ అధ్యక్షులు, మరియు ఏఈపిఆర్,అగ్రికల్చర్ ఆఫీసర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హౌసింగ్ ఏఈ, టెక్నికల్ అసిస్టెంట్లు మొదలైన అధికారులు పాల్గొన్నారు.




