డీకే శివకుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు!
గూడూరు : కర్ణాటక రాష్ట్ర ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తూ, ప్రజాస్వామ్య విలువలకు అంకితభావంతో నిరంతరం ప్రజల మధ్య పనిచేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ గారు కర్ణాటక రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు షేక్ నాయకుల ఫయాజ్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రజల అపార విశ్వాసాన్ని సంపాదించి, పార్టీ పట్ల తిరుగులేని నిబద్ధతతో, నిరంతరం కష్టపడే డైనమిక్ నాయకుడిగా దేశ రాజకీయాల్లోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన డీకే శివకుమార్ గారి నాయకత్వం నేటి యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఫయాజ్ కొనియాడారు. ఆయన రాజకీయ ప్రస్థానం ధైర్యం, సహనం, పట్టుదల, మరియు నిరంతర ప్రజాసేవ అనే ఉన్నత విలువలకు నిదర్శనమని పేర్కొంటూ, నూతన ముఖ్యమంత్రి పరిపాలనలో కర్ణాటక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమం, రైతుల పురోగతి, యువతకు ఉపాధి కల్పన మరియు లౌకిక విలువల పరిరక్షణలో డీకే శివకుమార్ గారి నాయకత్వం సరికొత్త చరిత్ర సృష్టించాలని, ప్రపంచం మొత్తం ఆయన పరిపాలన దక్షత వైపు చూసేలా అడుగులు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు షేక్ నాయకుల ఫయాజ్ ప్రకటించారు.

