శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి న్యూస్) నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీకాళహస్తి ఎంజీఎం కాలేజీ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరచి అద్భుత ఫలితాలను సాధించారు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం విభాగాల్లో పలువురు విద్యార్థులు స్టేట్ ర్యాంకులు, టౌన్ ఫస్ట్లు సాధించి కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జూనియర్ ఎంపీసీ విభాగంలో షేక్ హప్ ఫ్షా 466/470 మార్కులతో టౌన్ ఫస్ట్తో పాటు స్టేట్ ర్యాంక్ సాధించింది. ఎం.ధరణి, కే.స్వాతి తలో 464 మార్కులతో ప్రతిభ చాటారు. జూనియర్ బైపీసీ విభాగంలో జి.అనుప్ డానియల్ 441/455, వి.గాయత్రి మరియు బి.నికిత తలో 439 మార్కులతో మెరుగైన ఫలితాలు సాధించారు. జూనియర్ సీఈసీ విభాగంలో జి.తనూజ 488/500 మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించగా, వి.పద్మావతి, కే.జ్ఞానేంద్ర కుమార్ తలో 476 మార్కులు సాధించారు. జూనియర్ ఎంఈసీ విభాగంలో వెంకటాచలపతి 474/500, మీనాక్షి 464/500 మార్కులతో మెరుగైన ఫలితాలు నమోదు చేశారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం సీనియర్ ఎంపీసీ విభాగంలో సి.యశస్విని 988/1000 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, బి.ఓజస్విని 986, ఎస్.సానియా 985 మార్కులు సాధించారు. సీనియర్ బైపీసీలో కె.జ్యోతి కుమార్ హాసిని ప్రియ మరియు ఎం.సుమశ్రీ తలో 983 మార్కులు సాధించగా, ఎం.భవ్య శ్రీ 980 మార్కులు సాధించింది. సీనియర్ సీఈసీ విభాగంలో జి.కిషోర్ 982, వి.కామేష్ 966 మార్కులతో ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా ఎంజీఎం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ.. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పోటీ పరీక్షల్లో కూడా ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఎంజీఎం విద్యాసంస్థలు డిజిటల్ బోధన విధానాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఈ విజయాలు సాధించాయని తెలిపారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ వి.ఎస్. రత్నం, లెక్చరర్లు విద్యార్థులను అభినందించారు.

టౌన్ ఫస్ట్ నుంచి స్టేట్ ర్యాంకుల దాకా.. ఎంజీఎం విద్యార్థుల విజయపతాకం