Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

జీవీఎంసీ ఎన్నికల్లో బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి: బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో డిమాండ్*

రాబోయే విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) ఎన్నికల్లో జనాభా నిష్పత్తి ప్రకారం బ్రాహ్మణ సామాజికవర్గానికి ప్రధాన రాజకీయ పార్టీలు తగిన సంఖ్యలో వార్డుల నుండి పోటీ చేసే అవకాశం కల్పించాలని పలువురు బ్రాహ్మణ పెద్దలు, వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు శనివారం నగరంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ ఆత్మీయ సమా వేశంలో సుమారు 400 మంది సామాజికవర్గ సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచు కున్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధిలో బ్రాహ్మణుల పాత్ర ఎంతో కీలకమైనదని గుర్తుచేశారు. నగరంలోని పలు వార్డుల్లో బ్రాహ్మణ ఓటర్ల సంఖ్య గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉందని స్పష్టం చేశారు. అర్హులైన, సేవాతత్పరత కలిగిన బ్రాహ్మణ అభ్యర్థుల కు కార్పొరేటర్ టిక్కెట్లు కేటాయిస్తే స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు సామాజికవర్గ సంక్షేమానికి ఎంతగానో తోడ్పడుతుందని అభి ప్రాయపడ్డారు నగరంలోని బ్రాహ్మణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని, ఆసక్తి గల అభ్యర్థులకు సీట్లు కేటాయించేలా ప్రధాన పార్టీల అధిష్టానాల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని సమావేశం లో ప్రాథమికంగా నిర్ణ యించారు ఈ ఆత్మీయ సమావేశంలో బ్రాహ్మణ ప్రముఖులు చెరువు రామకోటయ్య,సుహాసిని ఆనంద్,కేశాప్రగడ నర సింహమూర్తి,గాడేపల్లి ప్రభాకర శాస్త్రి,ముళ్ళపూడి కోటేశ్వర రావు,రాచకొండ దశరధరామయ్య,వీవీ గిరి, నేరెళ్ల కామేశ్వర శర్మ,సోమ యాజుల విజయ్ కుమార్ శర్మ,నూకల సూర్యప్రకాష్, నెమ్మలూరి గణేష్,గంటి రవికుమార్ తదితరులతో పాటు జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి గల అభ్యర్థులు,నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *