అనకాపల్లి జిల్లా, జూలై 6 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామ సచివాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత జనసంఘ్ వ్యవస్థాపకులు, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయత, అఖండ భారత నిర్మాణానికి ఆయన చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ నాయకులు ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమం ఎంపీ సీఎం రమేష్ గారు , అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు దొరపరెడ్డి పరమేశ్వరరావు ఆదేశాల మేరకు బీఎల్ఏ–4 పోలింగ్ బూత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దేశ సమగ్రతను కాపాడడంలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నాయకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కిసాన్ మోర్చా ఎలమంచిలి మండల అధ్యక్షులు సన్నంశెట్టి శ్రీను, మొల్లేటి ప్రసాద్, జిల్లా రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి సత్యనారాయణ, ప్రచార కార్యకర్త ధార నూకరాజు, మహిళా మోర్చా నాయకురాలు వాసపల్లి శైలజ, బీఎల్ఏ సూపర్వైజర్ ప్రకాశ్‌రావు, మాజీ సర్పంచ్ బజంత్రీల శ్రీను, లక్ష్మి, మాజీ ఉపసర్పంచ్ కర్రి సింహాచలం, నాయకులు రాయి చలపతి, ధారా పోలిశెట్టి, అట్ట అప్పలనాయుడు, గొంతు మూర్తి, బండయ్య, అన్నం ఈశ్వరరావు, డి. గోవిందు, సచివాలయ సిబ్బంది నాగరాజు, అసిస్టెంట్ నూకరాజు, రాజు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ శుభ, వీఆర్వో జిలాని, బిల్ కలెక్టర్ రమణతో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం మహనీయులు చూపిన సేవా మార్గాన్ని యువత ఆదర్శంగా తీసుకుని జాతీయ చైతన్యంతో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.



