పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 30 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం లో 15 వ రోజు గ్రామ రెవెన్యూ సహాయకుల సహాయ నిరాకరణ ఉద్యమ పోరాట సమ్మె కార్యక్రమం లో భాగంగా సంఘం నాయకులు ఉరి తాడు మెడకు వేసుకుని వినూత్నమ్మగా నిరసన చేపట్టారు వీఆర్ఏలకు 10500 రూపాయలు మాత్రమే జీతం ఇస్తున్నారు నిత్యావసర సరుకులు రేట్లకు అనుగుణంగా మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని నిరసన తెలియజేసియజేయుచున్న రాష్ట్ర ప్రభుత్వము గాని సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి కూడా మా బాధలు మా కుటుంబ సమస్యలు ఏమాత్రం వారికి కనిపించడం లేదని ఆవేదనను వెల్లబుచ్చారు. ప్రభుత్వం గాక మా సమస్యలను పట్టించుకోకపోతే మా కుటుంబం మొత్తం ఉరితాడుతో నిరసన తెలియజేస్తామని తెలియజేశారు. రెవెన్యూ మంత్రి కనిపించడం లేదంటూ నిరసన నినాదాలు చేశారు


