Tuesday, 29 September 2026
  • Home  
  • జనసేన నాయకురాలు శరణ్యను సత్కరించిన చిన్నా జనసేన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనసేన నాయకురాలు శరణ్యను సత్కరించిన చిన్నా జనసేన

మర్రిపాడు: అనంతపురం జిల్లా జనసేన పార్టీ నాయకురాలు శరణ్యను మర్రిపాడు మండల జనసేన నాయకుడు చిన్నా జనసేన సోమవారం ఘనంగా సత్కరించారు. నెల్లూరు జిల్లాలో ఓ శుభకార్యానికి హాజరై మర్రిపాడు మీదుగా వెళ్తున్న శరణ్యను మండల కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శరణ్య మాట్లాడుతూ మర్రిపాడు మండలంలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు చిన్నా జనసేన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. చిన్నా జనసేనకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శరణ్యను కలిసిన సందర్భంగా నాయకులు పార్టీ బలోపేతంపై చర్చించారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.