వార్త ముఖ్యాంశాలు
- చెక్రాయపాలెం జెడ్పీహెచ్ఎస్లో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ కార్యక్రమం అద్దంకి (కె టి సి పున్నమి ప్రతినిధి ) చెక్రాయపాలెం: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం–2026 సందర్భంగా శుక్రవారం చెక్రాయపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “నా స్వరం – నా మనసు – నా పాఠశాల”…
- ఈ కార్యక్రమంలో హెచ్.ఎం.
- మరియు ఎం.ఈ.ఓ.
చెక్రాయపాలెం జెడ్పీహెచ్ఎస్లో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ కార్యక్రమం
అద్దంకి (కె టి సి పున్నమి ప్రతినిధి )
చెక్రాయపాలెం: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం–2026 సందర్భంగా శుక్రవారం చెక్రాయపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “నా స్వరం – నా మనసు – నా పాఠశాల” అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హెచ్.ఎం. మరియు ఎం.ఈ.ఓ. శ్రీ కె.వి. శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు తమ సమస్యలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో స్వేచ్ఛగా పంచుకోవాలని, పాఠశాలలో స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. తోటి విద్యార్థులను ఎగతాళి చేయకుండా, పరస్పరం గౌరవించుకుంటూ సహకార భావనతో మెలగాలని సూచించారు.
డిస్ట్రిక్ట్ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ గర్నెపూడి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యం ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమని వివరించారు. చదువులో ఒత్తిడి, భయం, బాధ లేదా ఇతర సమస్యలు ఎదురైనప్పుడు వాటిని మనసులోనే దాచుకోకుండా నమ్మకమైన పెద్దలతో మాట్లాడాలని తెలిపారు. సహాయం కోరడం బలహీనత కాదని, ధైర్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో V.ప్రమీల రాణి ,T. శ్రీనివాస్ రావు, G. శ్రీనివాస్ రెడ్డి, K. విజయ లక్ష్మి, S.V. రామ్ మోహనరెడ్డి పాల్గొన్నారు