వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు, ఆగస్టు 24 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మునిసిపాలిటీ పరిధిలో 50 సంవత్సరాలకు పైగా పేదలు నివసిస్తున్న చుక్కలు, తిప్ప పోరంబోకు భూములను ఫ్రీహోల్డ్‌గా మార్చి రిజిస్టర్ హక్కులు కల్పించాలని సీపీఎం ఆత్మకూరు పట్టణ కమిటీ డిమాండ్ చేసింది.
- సోమవారం సీపీఎం కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన నాయకులు ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పించారు.
- సీపీఎం పట్టణ కమిటీ కార్యదర్శి కొప్పోలు డేవిడ్ రాజు, సీఐటీయూ జిల్లా నాయకులు జి.
ఆత్మకూరు, ఆగస్టు 24 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మునిసిపాలిటీ పరిధిలో 50 సంవత్సరాలకు పైగా పేదలు నివసిస్తున్న చుక్కలు, తిప్ప పోరంబోకు భూములను ఫ్రీహోల్డ్‌గా మార్చి రిజిస్టర్ హక్కులు కల్పించాలని సీపీఎం ఆత్మకూరు పట్టణ కమిటీ డిమాండ్ చేసింది.
సోమవారం సీపీఎం కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన నాయకులు ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పించారు. సీపీఎం పట్టణ కమిటీ కార్యదర్శి కొప్పోలు డేవిడ్ రాజు, సీఐటీయూ జిల్లా నాయకులు జి. శివప్రసాద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ సందాని మాట్లాడుతూ పేదలకు భూములపై హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
సర్వే నంబర్ 1953లో 134.90 ఎకరాలు, 1959లో 15.38 ఎకరాలు, 1963లో 0.75 ఎకరాల్లో పేదలు దశాబ్దాలుగా నివసిస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ 22న ఆర్డీఓకు అర్జీలు సమర్పించగా, అధికారులు పత్రాలు సేకరించినప్పటికీ హక్కులు కల్పించడంలో జాప్యం జరుగుతోందన్నారు.
రిజిస్టర్ హక్కులు లేక బ్యాంకు రుణాలు పొందలేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చుక్కలు, తిప్ప పోరంబోకు భూములను ఫ్రీహోల్డ్‌గా మార్చి సంపూర్ణ హక్కులు కల్పించాలని కోరారు.