Sunday, 20 September 2026
  • Home  
  • చిట్వేలి ఎన్సీసీ క్యాడేట్లచే స్వచ్ఛత పక్వాడ ర్యాలీ
- అన్నమయ్య

చిట్వేలి ఎన్సీసీ క్యాడేట్లచే స్వచ్ఛత పక్వాడ ర్యాలీ

చిట్వేలి, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి): 30వ ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ ఎన్. సూర్యనారాయణమూర్తి ఆదేశాల మేరకు, చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్సీసీ ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో గురువారం గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత పక్వాడా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు, ఎన్సీసీ అధికారి పసుపుల రాజశేఖర్, ఎన్సీసీ క్యాడేట్లు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు మాట్లాడుతూ “మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో మనం నడవడం సమాజ శ్రేయస్సుకు దోహదం చేస్తుంది” అని పేర్కొన్నారు.ఆ తర్వాత ఎన్సీసీ క్యాడేట్లు పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి, ప్లకార్డులు పట్టుకొని “శుభ్రతే సేవ” నినాదాలతో పాఠశాల నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా చేరి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ “వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యవంతమైన జీవితం గడపగలము” అని వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఎన్సీసీ క్యాడేట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.

చిట్వేలి, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి):

30వ ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ ఎన్. సూర్యనారాయణమూర్తి ఆదేశాల మేరకు, చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్సీసీ ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో గురువారం గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత పక్వాడా ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు, ఎన్సీసీ అధికారి పసుపుల రాజశేఖర్, ఎన్సీసీ క్యాడేట్లు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు మాట్లాడుతూ “మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో మనం నడవడం సమాజ శ్రేయస్సుకు దోహదం చేస్తుంది” అని పేర్కొన్నారు.ఆ తర్వాత ఎన్సీసీ క్యాడేట్లు పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి, ప్లకార్డులు పట్టుకొని “శుభ్రతే సేవ” నినాదాలతో పాఠశాల నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా చేరి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ “వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యవంతమైన జీవితం గడపగలము” అని వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఎన్సీసీ క్యాడేట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.