నిడదవోలు, జూలై 29 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): గురు పౌర్ణమి సందర్భంగా నిడదవోలులో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రంగా వేంకటేశ్వరరావు సౌజన్యంతో పండ్ల వర్తకులకు గొడుగులు, వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నిడదవోలు నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ మద్దిపాటి రజని, బీఎల్ఏ–1 సింహాద్రి సత్యనారాయణ పాల్గొని గొడుగులు, హెల్మెట్లను అందజేశారు. కార్యక్రమంలో పాపారావు, సత్యనారాయణ, నరసింహారావు, బాలాజీ, లీలాకృష్ణతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు.



