మాదకద్రవ్యాల రవాణాపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. పాకిస్తాన్‌లోని ఖాసిం పోర్టు నుండి కచ్ తీరానికి వచ్చిన ఒక యూరోపియన్ నౌకపై గుజరాత్ ఏటీఎస్ (ATS), కోస్ట్‌గార్డ్ అధికారులు నిఘా పెట్టారు. నౌకలోని వారు సముద్రంలో పడేసిన సంచులను స్వాధీనం చేసుకోగా.. అందులో దాదాపు 100 కిలోల కొకైన్ లభ్యమైంది.
దీని విలువ సుమారు రూ. 1150 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ డ్రగ్స్ రవాణాకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసి, నౌకను సీజ్ చేశారు. ఈ ముఠా వెనుక ఉన్నవారి కోసం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.


