Tuesday, 14 July 2026
  • Home  
  • గిరిజన సమస్యలపై నారా లోకేష్‌తో మాసరపు సుబ్బయ్య చర్చ
- తిరుపతి

గిరిజన సమస్యలపై నారా లోకేష్‌తో మాసరపు సుబ్బయ్య చర్చ

శ్రీ కాళహస్తి, జులై 14, (పున్నమి న్యూస్): రాష్ట్ర ఐటీ, ఉన్నత విద్య శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్‌ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు, పీలేరు నియోజకవర్గ పరిశీలకులు మాసరపు సుబ్బయ్య కలిసి చిత్తూరు–తిరుపతి ఉమ్మడి జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా గిరిజనుల జీవన ప్రమాణాలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, పథకాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని మాసరపు సుబ్బయ్య మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నారా లోకేష్ గిరిజన సమస్యలను సమగ్రంగా పరిశీలించి, తగిన పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశం గిరిజనుల సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశకంగా నిలుస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.