*గార్లఒడ్డు నర్సరీలో మొక్కల పరిశీలన*
*అధికారుల బృందం పర్యటన.. మొక్కల పెంపకంపై పరిశీలన*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
గార్లఒడ్డు గ్రామపంచాయతీ పరిధిలోని నర్సరీ ప్లాంటేషన్‌లో పెంచుతున్న మొక్కలను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్, డీఎల్‌పీవో, ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవో, ఏపీఎం తదితర అధికారులు నర్సరీని సందర్శించి మొక్కల పెంపకం, సంరక్షణ, నిర్వహణ తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా నర్సరీలో మొక్కల అభివృద్ధి, వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మొక్కలను సమర్థవంతంగా సంరక్షించి, నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గార్లఒడ్డు గ్రామ సర్పంచ్ భూక్యా నర్సి, లాలూ నాయక్ ఉపసర్పంచ్ శివలంకి వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు భూక్యా లాలు, మాజీ ఎంపీటీసీ పేలప్రోలు వర శంకర్ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ భూక్య ఆనందరావు, వార్డు సభ్యురాలు డి. జ్యోతి తో పాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.



