ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్)
ఖమ్మం జిల్లా బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన శాసనల సాయిరామ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, యువతను మరింతగా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం, సంస్థాగత కార్యక్రమాల నిర్వహణపై చర్చించినట్లు తెలిసింది. నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని గల్లా సత్యనారాయణ సాయిరామ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీకొండ శ్యాం, నకిరికంటి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.



