చిట్వేల్: విఘ్నాలు తొలగించి భక్తులకు కార్యసిద్ధిని ప్రసాదించే విఘ్నేశ్వరుడు తొలి పూజలు అందుకుంటున్న సందర్భంగా చిట్వేల్ మెయిన్రోడ్లో క్రేజీ యూత్ ఆధ్వర్యంలో 18వ సంవత్సరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.గత 18 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన దాతలు, భక్తులు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పగడాల గణేష్ కుమార్, భరత్ కుమార్, కారణం వెంకటసుబ్బయ్య, రామిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితర క్రేజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

గణనాథుని ఆశీస్సులతో 18వ సంవత్సరం అన్నప్రసాద వితరణ