ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశం పొందిన ఎంబీబీఎస్ విద్యార్థులకు అక్టోబర్ 5 నుంచి బోధన ప్రారంభం కానుందని ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర కోటాలోని 85 సీట్లకు గాను ఇప్పటివరకు 81 మంది విద్యార్థులు ప్రవేశం పొందారని పేర్కొన్నారు. మరో రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యేలోపు జాతీయ కోటాతో పాటు రాష్ట్ర కోటా కలిపి మొత్తం 100 సీట్లు భర్తీ కానున్నాయని తెలిపారు. ప్రస్తుతం ప్రవేశం పొందిన 81 మందిలో 58 మంది బాలికలు ఉన్నారని వెల్లడించారు.



