ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్ మెయిన్ రోడ్‌లో 2వ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2వ పట్టణ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట నారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, మండదపు సుబ్బారావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీరామనేని మణి, 53వ డివిజన్ కంటెస్టెడ్ అభ్యర్థి శ్రీలత, పాసం శ్రీనివాస్ రెడ్డి, వంశీ తదితరులు పాల్గొన్నారు. దేశ ఐక్యత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.



